West Godavari District: సెల్‌ వాడొద్దంటూ మందలించిన పెంపుడు తండ్రి.. ఆత్మహత్య చేసుకున్న కుమార్తె.. తండ్రి పరారీ!

  • యువతి మృతిపై అనుమానాలు
  • కుమార్తెను వేధించిన పెంపుడు తండ్రి
  • ఆత్మహత్య అనంతరం పరారీ
సెల్‌ఫోన్‌లో పదేపదే మాట్లాడుతున్న కుమార్తెను మందలించడంతో మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన నాగమణి భర్త డర్రు నాగరాజు మృతి చెందడంతో విశాఖపట్టణానికి చెందిన ఈగల అప్పలరాజును రెండో వివాహం చేసుకుంది. నాగమణికి అప్పటికే ప్రియబాంధవి (20) అనే కుమార్తె ఉంది.

సోమవారం సెల్‌ఫోన్‌లో అదే పనిగా మాట్లాడుతున్న ప్రియబాంధవిని చూసిన పెంపుడు తండ్రి అప్పలరాజు మందలించాడు. దీంతో అడ్డువచ్చిన తల్లి భర్తతో గొడవపడింది. ఈ గొడవలు పడలేకపోతున్నానంటూ బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత కాసేపటికే భార్యకు ఫోన్ చేసిన అప్పలరాజు కుమార్తె ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పడంతో ఆమె కుప్పకూలిపోయింది.

నాగమణి ఇంటికి వచ్చి చూసేసరికి భర్త కనిపించకుండా పోయాడు. దీంతో అతడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియబాంధవిని అప్పలరాజు తరచూ వేధించేవాడని బంధువులు చెబుతున్నారు. దీంతో అతడి తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
West Godavari District
Nidadavolu
Suicide
cellphone
Crime News

More Telugu News