గాడిదకు కళ్లెం కట్టినంత మాత్రాన అది గుర్రం కాదు!: కేటీఆర్ పై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ నిర్వహించే సభను ‘ప్రగతి నివేదన సభ’ అని అనడం కన్నా ‘కేసీఆర్ ఆవేదన సభ’ అనడం కరెక్టని కాంగ్రెస్ పార్టీ నేత రేవతంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'కేసీఆర్ ఆవేదన అంతా ఒకటే.. కేటీఆర్ ని ఏ విధంగానైనా సరే, ముఖ్యమంత్రిని చేయాలన్నదే' అని విమర్శించారు.

‘నేను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా.. గాడిదకు కళ్లెం కట్టినంత మాత్రాన అది గుర్రం కాదు. అమెరికాలో బాత్రూమ్ లు కడుక్కునేటోడిని తీసుకొచ్చి ఐటీ మంత్రిని చేస్తే చేసుండొచ్చు కానీ, అంతకంటే పైకి నువ్వు ఎంత తోసినా పోలేడు. కేటీఆర్ సమర్థత ఏంటో.. కన్న తండ్రిగా నీకే ఎక్కువ తెలుసు మాకంటే...’ అంటూ రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ కు ఏ శాఖ ఇచ్చినా కూడా సమర్ధవంతంగా నిర్వహించలేదని, ఆ విషయం కేసీఆర్ కు తెలుసని.. కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం అన్నది జరగని విషయమని అన్నారు. నాడు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు తనపై పెట్టిన కేసుల గురించి మాట్లాడటమంటే అరిగిపోయిన రికార్డు లాంటిదని అన్నారు.
Go Back to Shorts
KTR
Revanth Reddy

More Telugu News