kcr: ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్

  • ముగిసిన మూడు రోజుల ఢిల్లీ పర్యటన
  • పర్యటనలో భాగంగా ప్రధాని, మంత్రులను కలిసిన సీఎం
  • పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరిన వైనం  
మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు టీఆర్ఎస్ నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. కాగా, కేసీఆర్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీని కలిశారు. తెలంగాణ సమస్యలపై, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం, రక్షణ భూముల బదలాయింపు తదితర అంశాలను పరిష్కరించాలని కోరుతూ వారికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 
kcr
delhi to hyderabad

More Telugu News