election commission: రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం

  • 7 జాతీయ, 51 ప్రాంతీయ పార్టీల హాజరు
  • టీడీపీ తరపున రావుల, కనకమేడల హాజరు
  • టీఆర్ఎస్ నుంచి వినోద్, వైసీపీ నుంచి విజయసాయి హాజరు
దేశంలోని వివిధ రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయింది. ఈ భేటీకి 7 జాతీయ పార్టీలు, 51 ప్రాంతీయ పార్టీలు హాజరయ్యాయి. టీడీపీ తరపున కనకమేడల రవీంద్రకుమార్, రావుల చంద్రశేఖర్ రెడ్డి హాజరుకాగా... వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, టీఆర్ఎస్ నుంచి ఎంపీ వినోద్, సీపీఐ నుంచి నారాయణ, తదితరులు హాజరయ్యారు. బీజేపీ తరపున కేంద్ర మంత్రి జేపీ నడ్డా, భూపేంద్ర యాదవ్ లు భేటీకి వచ్చారు. మరోవైపు, రానున్న ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని ఈసీని కాంగ్రెస్ కోరనున్నట్టు సమాచారం.
election commission
meeting
Telugudesam
ysrcp
congress
bjp
TRS

More Telugu News