Padma: బ్యూటీషియన్ పద్మ ఎడమ చేతిని తొలగించిన వైద్యులు!

  • ప్రియుడి చేతిలో దారుణంగా హింసించబడ్డ పద్మ
  • నరాలు తెగి రక్త ప్రసరణ జరగక ఇన్ఫెక్షన్
  • పరిస్థితి క్రిటికల్ గానే ఉందంటున్న వైద్యులు
తన ప్రియుడు నూతన్ చేతిలో దారుణంగా హింసించబడ్డ బ్యూటీషియన్ పల్లె పద్మ చేతిని వైద్యులు తొలగించారు. గడచిన ఐదు రోజులుగా, ఎడమ చేతి నరాలు పనిచేయక పోవడంతో రక్త ప్రసరణ నిలిచి పోయి, ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా చేతిని తొలగించామని, రెండో చేతికి చికిత్స జరుగుతోందని వైద్యులు వెల్లడించారు. ఇప్పటికీ ఆమె పరిస్థితి క్రిటికల్ గానే ఉందని తెలిపిన వైద్యులు, ఆమె మిగతా అవయవాలన్నీ సక్రమంగా పనిచేయడం మొదలయ్యాక ఇతర శస్త్ర చికిత్సలు ప్రారంభిస్తామని అంటున్నారు. ఆమె చికిత్సకు స్పందించే విధానాన్ని బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.
Padma
Vizag
Nutan
Murder Attempt

More Telugu News