Zaira: విమానంలో 'దంగల్' నటిని అసభ్యంగా తాకిన సచ్ దేవ్ అరెస్ట్!

  • విమానంలో వేధింపులు
  • వెనుక నుంచి కాలుపెట్టి అసభ్యంగా తాకిన సచ్ దేవ్
  • చార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు
కొంతకాలం క్రితం మైనర్ నటిపై విమానంలో లైంగిక వేధింపులకు పాల్పడిన వికాస్ సచ్ దేవ్ అనే వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేశారు. 'దంగల్'లో నటించిన యువతి ఢిల్లీ నుంచి ముంబైకి వెళుతుండగా, వెనుక కూర్చున్న ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె వీడియో తీసి మరీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ వీడియో వైరల్ కాగా, సచ్ దేవ్ ను అరెస్ట్ చేయాలన్న డిమాండ్ కు మహిళా సంఘాల నుంచి మద్దతు లభించింది. తాను గాఢనిద్రలో అలసిపోయి తప్పుగా ప్రవర్తించానేమో తనకు తెలియదని సచ్ దేవ్ తెలిపాడు. ప్రచారం కోసం ఆమె ఆరోపణలు చేస్తోందని కూడా అన్నాడు. ఈ కేసును విచారించిన పోలీసులు, ముంబయ్ లోని దిన్ దోషి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇక తాము కోర్టులోనే పోరాడుతామని సచ్ దేవ్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.
Zaira
Dangal
Flight
Harrasment
Sachdev

More Telugu News