Revanth Reddy: మోదీ ముందు మోకరిల్లిన కేసీఆర్: రేవంత్ రెడ్డి

  • కేసీఆర్ కు అధిష్ఠానం మోదీయే
  • ట్విట్టర్ ఖాతాలో రేవంత్ రెడ్డి
  • ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు
  • ప్రగతి నివేదన సభలో మరింత స్పష్టత వచ్చే అవకాశం
ముందస్తు ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ మోకరిల్లారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. కేసీఆర్ కు అధిష్ఠానం మోదీయేనని ఆరోపించిన రేవంత్, "ముందస్తు కోసం మోదీ (అధిష్ఠానం) ముందు మోకరిల్లిన కెసిఆర్" అంటూ వ్యాఖ్యానించారు.

సార్వత్రిక ఎన్నికల కన్నా ముందుగానే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిపించుకోవాలని, త్వరలో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే వారంలో, 2వ తేదీన హైదరాబాద్ శివార్లలోని కొంగరకలాన్ లో ప్రగతి నివేదన సభ భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న టీఆర్ఎస్, ఈ సభలో ముందస్తు, అసెంబ్లీ రద్దు తదితర అంశాలపై మరింత స్పష్టతను ఇచ్చే అవకాశాలున్నాయి.
Revanth Reddy
KCR
Telangana
Narendra Modi

More Telugu News