Andhra Pradesh: గ్రహబలం బాగుంటే పవన్ కూడా ముఖ్యమంత్రి అవుతారు: సినీ నటుడు సుమన్
- సినీ రంగంలో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సుమన్
- గుంటూరులో సన్మానం
- పవన్ ప్రసంగాలు బాగుంటున్నాయంటూ ప్రశంసలు
సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన వారిలో జాతక, గ్రహబలం బాగున్నవారు ముఖ్యమంత్రులు కాగలిగారని, పవన్‌కు కూడా అవి బాగుంటే సీఎం అవుతారని సినీ నటుడు సుమన్ అన్నారు. సుమన్ సినీ రంగ ప్రవేశం చేసి 4 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా గుంటూరులో ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన ప్రసంగాలు ఆకట్టుకునేలా ఉంటున్నాయని ప్రశంసించారు. యువత ఫాలోయింగ్ పవన్‌కు పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. అయితే, పవన్ సీఎం కావాలంటే జాతక బలం కూడా ఉండాలని స్పష్టం చేశారు. గ్రహబలం, జాతక బలం బాగున్నవారే ముఖ్యమంత్రులు కాగలిగారని పేర్కొన్న సుమన్.. పవన్ విషయంలోనూ ఇది వర్తిస్తుందన్నారు. ఆయన జాతకం ఎలా ఉందో తెలియదని, అది బలంగా ఉంటే మాత్రం ఆయనను సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని సుమన్ అభిప్రాయపడ్డారు.