pakistan occupied kashmir: తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ... పీవోకేలో మళ్లీ నిరసనలు!

  • పాక్ ఆక్రమిత కశ్మీరులో స్థానికుల నిరసనలు
  • కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ ఆగ్రహం
  • ప్రధానులు మారినా, తలరాతలు మారడం లేదంటూ ఆవేదన
పాక్ ఆక్రమిత కశ్మీరులో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు మళ్లీ నిరసనలు చేపట్టారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ తలరాతలు మారడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రధాని వచ్చినా, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లు, కాలేజీల వంటి ప్రాథమిక వసతులను కూడా కల్పించడం లేదని వాపోయారు. అధికారంలో ఉన్న ప్రధానులు హామీలు ఇవ్వడం మినహా... చేస్తున్నదేమీ లేదని చెప్పారు. తమ గళాన్ని వినిపించేందుకు నిరసనలకు దిగడం మినహా తమకు మరో దారి లేకపోతోందని వారు చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీరును పాక్ ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో పాక్ సైన్యం ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. నిరసనకారులను అణచి వేసేందుకు సైన్యం ఎంతకైనా తెగిస్తుంది.
pakistan occupied kashmir
protests

More Telugu News