krish: డైరెక్టర్ క్రిష్ తో గొడవపై కంగనా రనౌత్ స్పందన

  • క్రిష్ తో నాకు ఎలాంటి విభేదాలు లేవు
  • ప్రతి రోజు ఇద్దరం మాట్లాడుకుంటుంటాం
  • 'ఎన్టీఆర్' సినిమా రిలీజ్ రోజున కూడా డేట్లు ఎవరికీ ఇవ్వలేదు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో, వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని, ఇద్దరికీ గొడవ జరిగిందనే వార్తలు బీటౌన్ లో ప్రచారమవుతున్నాయి. కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పుకుంటున్నారు.

ఈ వార్తలపై కంగనా రనౌత్ స్పందించింది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ప్రతి రోజు ఇద్దరం మాట్లాడుకుంటుంటామని చెప్పింది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'ఎన్టీఆర్' బయోపిక్ జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుందని... దాంతో, ఆరోజు తాను ఎలాంటి డేట్లు ఇవ్వలేదని తెలిపింది. 'మణికర్ణిక' సినిమాలో మరికొన్ని ఆసక్తికర అంశాలను తెరకెక్కించాలని రచయితలు నిర్ణయించారని... తాను కూడా దానికి ఒప్పుకున్నానని చెప్పింది. క్రిష్, తాను ఏ విషయంలో గొడవపడలేదని, తమ మధ్య మంచి స్నేహం ఉందని తెలిపింది. 
krish
kangana ranaut
bollywood
tollywood
manikarnika

More Telugu News