Kondru Murali: 31న టీడీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళి!

  • 31న భారీ ర్యాలీగా అమరావతికి
  • 10 ఏసీ బస్సులు, 50 కార్లలో రానున్న అనుచరగణం
  • ఉదయం 9 గంటలకు టీడీపీలో చేరనున్న కొండ్రు మురళి
కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళి, 31వ తేదీ శుక్రవారం నాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఆయన చేరికతో శ్రీకాకుళం జిల్లా రాజాం ప్రాంతంలో టీడీపీ మరింతగా బలపడుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొండ్రు మురళిని చేర్చుకునే విషయంలో చంద్రబాబు సుముఖంగా ఉండగా, నేడు తన కార్యకర్తలు, అనుచరులతో సమావేశం కానున్న మురళి, కాంగ్రెస్ ను ఎందుకు వీడాల్సి వస్తుందో చెప్పనున్నారు. రాజాం పట్టణం పాలకొండ రహదారిలోని కొండ్రు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.

31న 10 ఏసీ బస్సులు, 50 కార్లలో కాన్వాయ్ గా వెళ్లి కొండ్రు మురళి టీడీపీ కండువాను కప్పుకోనున్నారు. ఉదయం 9 గంటలకు పార్టీలో చేరిక ముహూర్తాన్ని నిర్ణయించగా, ముందు రోజే వీరంతా ర్యాలీగా రహదారిపై బయలుదేరనున్నారని తెలుస్తోంది. కాగా, రాజాంలో నిన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా ఉన్న కొండ్రు ఆఫీస్ ఇప్పుడు పసుపు జండాలతో నిండిపోతోంది. కాంగ్రెస్ పార్టీ కటౌట్లను తొలగించిన కొండ్రు మురళి అనుచరులు, కొత్త ప్లెక్సీలను ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారు.
Kondru Murali
Telugudesam
Chandrababu
Amaravati
Rajam

More Telugu News