Chandrababu: శ్రావణ పౌర్ణమి శుభవేళ చంద్రబాబు ఇంట సందడే సందడి!

  • చంద్రబాబుకు రాఖీలు కట్టిన బ్రహ్మ కుమారీస్
  • శుభాభినందనలు తెలిపిన పలువురు మహిళలు
  • పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలు
శ్రావణ పౌర్ణమి శుభవేళ, అమరావతిలోని ఏపీ సీఎం చంద్రబాబునాయుడి నివాసం సందడిగా మారింది. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మకుమారీస్‌ సంస్థకు చెందిన పలువురు మహిళలు ఈ ఉదయం చంద్రబాబుకు రాఖీలు కట్టి శుభాభినందనలు తెలియజేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన బ్రహ్మకుమారీస్‌ సంస్థ సభ్యులు శాంత, భారతి, పద్మజ తదితరులతో పాటు, పలువురు టీడీపీ మహిళా నేతలు చంద్రబాబుకు రాఖీలు కట్టారు. చంద్రబాబును కలిసేందుకు విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున మహిళలు చేరుకోవడంతో సీఎం నివాస ప్రాంతం సందడిగా మారింది.
Chandrababu
Rakhi Poirnami
Brahmakumaries
Amaravati

More Telugu News