Chandrababu: మోదీ కంటే ముందే సీఎంనయ్యా.. నాకు పరిపక్వత లేదంటరా?: చంద్రబాబు

  • మోదీ 2002లో సీఎం అయ్యారు
  • నేను 1995లో ముఖ్యమంత్రినయ్యా
  • అదృష్టం కలిసొచ్చి ఆయన పీఎం అయ్యారు
నరేంద్రమోదీ ముఖ్యమంత్రి కావడానికి ముందే తాను సీఎంను అయ్యానని, తొమ్మిదేళ్లు ఏకబిగిన ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించానని చంద్రబాబు పేర్కొన్నారు. అటువంటి తనకు పరిపక్వత లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. శనివారం కర్నూలులోని ఎస్టీబీసీ మైదానంలో నిర్వహించిన ధర్మ పోరాట సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను 1995లోనే ముఖ్యమంత్రిని అయ్యానని, మోదీ 2002లో సీఎం అయ్యారని చంద్రబాబు వివరించారు. ఇప్పుడు అదృష్టం కలిసొచ్చి ప్రధాని అయ్యారని పేర్కొన్నారు. అటువంటాయన తనకు పరిపక్వత లేదని అన్నారని, అది లేనిది తనకా.. ఆయనకా? అనేది ప్రజలకు తెలుసన్నారు. పరిపక్వత గురించి మోదీ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదన్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలో మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చిందని, అంతే తప్ప ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
Chandrababu
Narendra Modi
Andhra Pradesh
Gujarat
CM
India

More Telugu News