West Bengal: పెళ్లికూతురి అలంకారంలో నగ్నంగా ఫొటో షూట్... చంపేస్తామంటున్న సంప్రదాయవాదులు!

షార్ట్స్‌లో చూడండి
ఓ మోడల్, మరో ఫొటోగ్రాఫర్ కళాత్మకత, వారిద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. అందరిలా ఫొటో షూట్ నిర్వహించకుండా, కాస్తంత వెరైటీగా ఫొటోలు తీయాలని భావించిన ఆ ఫొటోగ్రాఫర్ ఇప్పుడు సంప్రదాయవాదుల నుంచి ప్రాణహానిని ఎదుర్కొంటున్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఫొటో గ్రాఫర్ ప్రీతమ్ మిత్రా, ఓ మోడల్ ను పెళ్లి కూతురిలా అలంకరించి, ఆమెను నగ్నంగా ఫొటోలు తీయడమే ఇందుకు కారణం.

నుదుటన పెద్ద బొట్టు, తలపై బెంగాలీ వధువు అలంకరించుకునే కిరీటం పెట్టాడు. ఫొటో షూట్ అయితే బాగానే వచ్చింది కానీ, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన తరువాత ప్రీతమ్ కు చిక్కులు ఎదురయ్యాయి. సంప్రదాయాలను ఆయన దెబ్బతీశాడంటూ బెదిరింపులు వచ్చాయి. ఆ ఫొటోలు తొలగించకుంటే హత్య చేస్తామని ఫోన్లు చేసి మరీ బెదిరిస్తుండటంతో ప్రీతమ్ ఇప్పుడు పోలీసులను ఆశ్రయించాడు.
Go Back to Shorts
West Bengal
Nude
Bride
Photo Shoot
Preetam Mitra

More Telugu News