vijayasai reddy: మాజీ డీజీపీ సాంబశివరావు వైసీపీలో చేరతారన్న విజయసాయిరెడ్డి.. ఖండించిన మాజీ డీజీపీ!

  • వైసీపీలోకి ఆయన రానుండటం శుభపరిణామం
  • సాంబశివరావు సలహాలు, సూచనలు తీసుకుంటాం
  • మీడియాతో విజయసాయిరెడ్డి
వైసీపీ అధినేత జగన్ ని ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు ఈరోజు కలిసిన విషయం తెలిసిందే. వైసీపీలోకి సాంబశివరావు వెళుతున్నారనే వార్తల నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. సాంబశివరావు త్వరలోనే తమ పార్టీలో చేరనున్నారని, ఇది శుభపరిణామమని సంతోషం వ్యక్తం చేశారు. సాంబశివరావు సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు.

విజయసాయిరెడ్డి ప్రకటనను ఖండిస్తున్నా: సాంబశివరావు

అయితే, విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనను సాంబశివరావు ఖండించారు. జగన్ ని తాను కలవడంలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, గంగవరం పోర్టు సీఈఓ హోదాలో మర్యాదపూర్వకంగానే ఆయన్ని కలిశానని అన్నారు. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన్ని తాను కలిసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని సాంబశివరావు స్పష్టం చేశారు.
vijayasai reddy
ex dgp samba siva rao

More Telugu News