modi: మోదీలా మాట త‌ప్పం.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తాం: వీహెచ్

షార్ట్స్‌లో చూడండి
న‌రేంద్ర‌మోదీలా మాట త‌ప్పమని, ఆంధ్ర‌కు ప్ర‌త్యేక హోదా ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) అన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్నభవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా కచ్చితంగా ఇస్తామని అన్నారు. దేశంలో దళితులకు న్యాయం జరగడం లేదని ఎస్సీ, ఎస్టీ స్థితిగతులపై పార్లమెంట్ కమిటీ నివేదిక ఇచ్చిందని అన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆయన విరుచుకుపడ్డారు. అన్ని కులాలకు కేసీఆర్ వరాలు కురిపిస్తున్నారని, ఓట్ల చీలిక కోసమే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని, తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్’ తరపున సీఎం అభ్యర్థి ఎవరనే విషయం పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు.
Go Back to Shorts
modi
vh

More Telugu News