modi: ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ
కొద్ది సేపటి క్రితం ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. మోదీతో కేసీఆర్ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా 14 అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు గురించి మరోసారి ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం పొందడంతో పాటు, బీసీ రిజర్వేషన్ బిల్లుపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. రక్షణ శాఖ భూములు రాష్ట్రానికి బదలాయింపు, ఐఐఎం మంజూరు గురించి, కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.