chiranjeevi: అభిమాని కూతురికి తన ఇంట్లో నామకరణం చేసిన మెగాస్టార్!

  • చిరంజీవి అంటే ఎంతో అభిమానం 
  • ఆయన పేరుపై ఎన్నో సేవా కార్యక్రమాలు 
  • ఆహ్వానం పంపిన చిరంజీవి    
చిరంజీవికి ఎంతోమంది అభిమానులు వున్నారు. వాళ్లంతా కూడా చిరంజీవి పట్ల గల ఆరాధనా భావంతో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలాంటి మెగా అభిమానులలో కొంతం ప్రసాద్ ఒకరు. తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామానికి చెందిన ఆయన, 20 సంవత్సరాల నుంచి చిరంజీవి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఆగస్టు 22 .. 2017లో ఆయనకి రెండవ సంతానంగా ఒక పాప జన్మించింది. చిరంజీవి పుట్టినరోజునాడే తనకి పాప పుట్టడం వలన, ఆయనతోనే ఆ పాపకి నామకరణం చేయించాలని ప్రసాద్ భావించాడు. అప్పటి నుంచి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోన్న ఆయనకి, తాజాగా మెగాస్టార్ నుంచి ఆహ్వానం అందింది. దాంతో ప్రసాద్ తన భార్య బిడ్డలతో చిరంజీవిని కలుసుకున్నాడు. చిరంజీవి ఆ పాపకి 'ఆరుషి' అని నామకరణం చేసి .. ఆశీస్సులు అందజేశారు. మెగాస్టార్ చేతుల మీదుగా తమ పాపకి నామకరణం జరగడం పట్ల ప్రసాద్ దంపతులు ఆనందంతో పొంగిపోతూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశారు.      
chiranjeevi

More Telugu News