Police: సహోద్యోగి భార్యనే చెరపట్టిన పోలీస్.. కటకటాల వెనక్కి నెట్టిన అధికారులు!

  • కృష్ణా జిల్లాలోని పోలీస్ క్వార్టర్స్ లో ఘటన
  • భర్త లేని సమయంలో అత్యాచారయత్నం
  • కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు
అతను ప్రజలకు రక్షణ కల్పించే గౌరవప్రదమైన పోలీస్ వృత్తిలో ఉన్నాడు. అయితేనేం, తోటి ఉద్యోగి భార్యపైనే కన్నేసి ఆమెను బలాత్కారం చేయబోయాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. కృష్ణా జిల్లాలోని పోలీస్ క్వార్టర్స్ లో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కృష్ణా జిల్లా ఆర్మ్ డ్ రిజర్వ్ విభాగంలో బాగావతు బాలాజీ నాయక్, ఎల్లయ్య కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ పోలీస్ క్వార్టర్స్ లోని యూ బ్లాక్ లో ఎదురెదురు ఇళ్లలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బాలాజీ భార్యపై ఎల్లయ్య కన్నేశాడు. అతను విధులకు వెళ్లిన తర్వాత ఇంట్లోకి దూకి తన కోరిక తీర్చాలని బాలాజీ భార్యను వేధించాడు. ఆమె అంగీకరించకపోవడంతో బలాత్కారం చేయబోయాడు.

ఇంతలో ఏదో పని ఉండి ఇంటికి చేరుకున్న బాలాజీ ఈ ఘటన చూసి విస్తుపోయాడు. వెంటనే ఎల్లయ్యపై దాడికి దిగాడు. దీంతో ఘటనాస్థలం నుంచి సదరు ప్రబుద్ధుడు పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

  కేసు నమోదు చేసిన పోలీసులు.. శుక్రవారం ఎల్లయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్ కు తరలించారు.
Police
Prakasam District
rape
arrest

More Telugu News