Virat Kohli: చిన్ని అభిమాని కోరికను తీర్చిన విరాట్.. వైరల్ గా మారిన వీడియో!

క్రికెట్ మైదానంలో ప్రత్యర్థులపై విరుచుకుపడే భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అభిమానుల మనసులను దోచుకోవడంలో ఎప్పుడు ముందుంటాడు. తాజాగా వందలాది మంది మధ్యలో ఓ చిన్ని అభిమాని పిలుపును విన్న కోహ్లీ అతని దగ్గరకు వెళ్లాడు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ట్రెండ్ బ్రిడ్జ్ లో ఇంగ్లండ్ జట్టుతో జరిగిన టెస్టులో విజయం అనంతరం విరాట్ స్టేడియం బయట అభిమానులకు ఆటోగ్రాఫ్ లు ఇస్తూ ముందుకు సాగాడు. అంతమందిలోనూ ఓ చిరు అభిమాని విరాట్ ను చూసేందుకు దూసుకొచ్చాడు. అక్కడే నిలబడి ‘విరాట్.. ఒక్క ఫొటో ప్లీజ్’ అంటూ అర్థించాడు. దీంతో ఆ పిల్లాడిని చూసిన కోహ్లీ.. అతని దగ్గరకు వెళ్లాడు. స్మార్ట్ ఫోన్ తీసుకుని అతడితో సెల్ఫీ దిగాడు. అంతేకాకుండా ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు.

ఏకంగా విరాట్ తో సెల్ఫీ దిగి ఆటోగ్రాఫ్ తీసుకోవడంతో ఆ పిల్లాడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఐసీసీ టెస్ట్ బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో విరాట్ ఇటీవల ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సాధించిన సంగతి తెలిసిందే.
Virat Kohli
Cricket
england

More Telugu News