blood pressure: యువతలో రక్తపోటు పెరగడానికి మరో కారణం.. పాస్పేట్!

  • పాస్పేట్ పెరగడం వల్ల నిమిషానికి నాలుగుసార్లు ఎక్కువ కొట్టుకుంటున్న గుండె
  • కాఫీ, వెన్న, నిల్వవున్న ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతున్నట్లు గుర్తింపు
  • బీపీ పెరిగి మూత్రపిండాల వ్యాధిన పడే అవకాశం 
యువతలో రక్తపోటు పెరగడానికి తాజాగా మరో కారణాన్ని కనుగొన్నారు. వివిధ రూపాల్లోని ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతున్న ‘పాస్పేట్‌’ రక్తపోటు పెరిగేందుకు దోహదపడుతోందని స్విట్జర్లాండులోని బసెల్‌ వర్సిటీ ఆచార్యులు రెటో క్రాఫ్‌ బృందం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీనివల్ల గుండె నిమిషానికి నాలుగుసార్లు ఎక్కువ కొట్టుకుంటోందని గుర్తించారు.

కాఫీ ఎక్కువగా తీసుకోవడం, వెన్నపూసిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన మాంసంలో పాస్పేట్‌ అధికంగా ఉంటుంది. 'శరీరం రోజుకి సగటున 700 మిల్లీ గ్రాముల వరకు పాస్పేట్‌ను స్వీకరించగలదు. అంతకు మించితే అది రక్త నాళాల్లో పేరుకుపోతుంది. దీంతో బీపీ పెరిగి మూత్రపిండాల వ్యాధి బారిన పడే అవకాశం ఉంది’ అని పరిశోధనా బృందాన్ని ఉటంకిస్తూ అమెరికా సొసైటీ ఆఫ్‌ నెఫ్రాలజీ జర్నల్‌ ప్రచురించింది. రక్తంలో పేరుకుపోయిన పాస్పేట్‌ను కరిగించేందుకు విటమిన్‌-డి శరీరానికి అవసరమని, ఇందుకోసం నీరెండలో కాసేపు తిరిగితే మంచిదని సూచించింది. 
blood pressure
phosphate

More Telugu News