kcr: ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ మొగ్గు.. వచ్చే నెలలో అసెంబ్లీ రద్దయ్యే అవకాశం?

  • పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ సంకేతాలు
  • డిసెంబర్ లో ఎన్నికలకు మొగ్గుచూపుతున్న కేసీఆర్
  • ప్రగతి నివేదన సభలో కీలక ప్రకటన వెలువడే అవకాశం
ముందస్తు ఎన్నికలకే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గుచూపుతున్నారు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ప్రగతి నివేదన సభలో ఎన్నికల భేరీ మోగిద్దామని పార్టీ శ్రేణులకు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికలకు డిసెంబర్ ముహూర్తంపై చర్చ జరిగింది.

ఒకవేళ డిసెంబర్ లో ఎన్నికలు రావాలంటే... సెప్టెంబర్ (వచ్చే నెల)లో అసెంబ్లీ రద్దు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు రాజీవ్ శర్మ ఢిల్లీలో మకాం వేసి, ముందస్తు ఎన్నికలపై చర్చలు జరుపుతున్నారు. నిన్న ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తుంటే... ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రగతి నివేదన సభలో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
kcr
elections
TRS
telangana

More Telugu News