Nirmala Sitharaman: కొడగావ్ కు ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ. కోటి సాయం చేసిన కేంద్ర మంత్రి

  • కొడగావ్ వరద సాయంగా కోటి విరాళమిచ్చిన నిర్మలా సీతారామన్ 
  • ఎంపీ ల్యాడ్స్ నుండి సాయమందించిన కేంద్ర మంత్రి 
  • వరద పరిస్థితులను పీఎంకు వివరిస్తానన్న మంత్రి
కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు కర్ణాటకలోని కొడ్‌గావ్ ప్రాంతంలో పర్యటించారు. వరదలతో నష్టపోయిన కొడగావ్ కు  ఎంపీ ల్యాడ్స్ నుండి కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో కలసి ఈవేళ ఆమె కొడగావ్ లో దెబ్బ తిన్న రోడ్ల పరిస్థితిని వివరించి రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రధాని మోదీ, హోం శాఖా మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి వరద పరిస్థితులను తీసుకెళ్ళి కర్ణాటకకు సాయమందించేందుకు కృషి చేస్తానని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Nirmala Sitharaman
BJP

More Telugu News