Konaseema: ముంపుబారి నుంచి బయటపడని కోనసీమ లంక గ్రామాలు

షార్ట్స్‌లో చూడండి
గోదావరి వరద ఉద్ధృతి తగ్గినా కోనసీమలోని లంక గ్రామాలు  ఇంకా ముంపు బారి నుంచి బయటపడలేదు. గ్రామాలను చుట్టుముట్టిన వరదనీటి ప్రవాహం తగ్గుముఖం పట్టలేదు. పి.గన్నవరం నియోజకవర్గంలోని వీరవల్లిపాలెం, అయినవిల్లి లంక, పల్లపులంక, అద్దంకివారి లంక, పొట్టిలంక, కె.పెదలంక, కొండకుదురులంక గ్రామాలు వారం రోజులుగా వరద నీటిలోనే ఉన్నాయి. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. నిత్యావసరాల్లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికార యంత్రాంగం తమను పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. 
Go Back to Shorts
Konaseema

More Telugu News