aadith: రొమాంటిక్ లవ్ స్టోరీగా '24 కిస్సెస్' . . ట్రైలర్ రిలీజ్

షార్ట్స్‌లో చూడండి
యూత్ కి కనెక్ట్ అయితే చాలు, ప్రేమకథా చిత్రాలు ఘన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. అందువలన యువ దర్శక నిర్మాతలు ఎక్కువగా ప్రేమకథా చిత్రాలపైనే దృష్టిపెడుతున్నారు. అలా ప్రేమకథాంశమే నేపథ్యంగా '24 కిస్సెస్' చిత్రం రూపొందింది. హెబ్బా పటేల్ .. ఆదిత్ జంటగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. యూత్ ను దృష్టిలో పెట్టుకుని ట్రైలర్లో రొమాంటిక్ సీన్స్ కు ప్రాధాన్యతనిచ్చారు. అయోధ్య కుమార్ దర్శకత్వం వచ్చిన ఈ సినిమాను వచ్చేనెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. కొంతకాలంగా సక్సెస్ లు లేక రేసులో వెనుకబడిపోయిన హెబ్బా పటేల్ కి , ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.
Go Back to Shorts
aadith
hebba patel

More Telugu News