akshay kumar: 'కత్తి' హిందీ రీమేక్ కి సన్నాహాలు .. పరిశీలనలో ఇద్దరు హీరోల పేర్లు

షార్ట్స్‌లో చూడండి
విజయ్ హీరోగా చాలాకాలం క్రితం మురుగదాస్ తెరకెక్కించిన 'కత్తి' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఇదే సినిమా .. చిరంజీవి హీరోగా 'ఖైదీ నెంబర్ 150' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా భారీవసూళ్లతో అరుదైన రికార్డును సష్టించింది. దాంతో ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను సంజయ్ లీలా బన్సాలి సొంతం చేసుకున్నారు.

 అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా కథలో ఆయన కొన్ని మార్పులను చేస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో హీరోగా అక్షయ్ కుమార్ గానీ .. రణ్ వీర్ సింగ్ గాని నటించే అవకాశాలు వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. గతంలో 'విక్రమార్కుడు'ను 'రౌడీ రాథోడ్' పేరుతోనూ, 'రమణ' సినిమాను 'గబ్బర్' పేరుతోను సంజయ్ లీలా బన్సాలి రీమేక్ చేశారు. ఈ రెండు సినిమాల్లోనూ అక్షయ్ కుమార్ హీరోగా చేశాడు. కనుక .. 'కత్తి' రీమేక్ లోను ఆయనే హీరోగా చేసే ఛాన్స్ ఎక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.         
Go Back to Shorts
akshay kumar

More Telugu News