Andhra Pradesh: పెళ్లికి వెళుతుండగా బోల్తాపడిన వాహనం.. ఆరుగురు దుర్మరణం

  • అదుపు తప్పి బోల్తాపడిన వాహనం
  • అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారణ
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అనంతపురం జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వివాహానికి హాజరయ్యేందుకు వాహనంలో వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న వాహనం పెనుకొండ మండలం సత్తారుపల్లి వద్ద అదుపు తప్పి బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.  
Andhra Pradesh
Anantapur District
Road Accident
Marriage

More Telugu News