Tirumala: అమరావతిలోనూ శ్రీవారి ఆలయం.. 25 ఎకరాల్లో ఆధ్యాత్మిక ధామం!

  • అమరావతిలో కొలువుదీరనున్న కలియుగ దైవం
  • రూ.140 కోట్ల వ్యయం
  • రెండేళ్లలోనే నిర్మాణం పూర్తి
తిరుమల వేంకటేశుడు ఇక అమరావతిలోనూ కొలువుదీరనున్నాడు. కృష్ణానదీ తీరాన 25 ఎకరాల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక ధామాన్ని నిర్మించబోతున్నారు. వచ్చే రెండేళ్లలోనే ఇది పూర్తికానుంది. తిరుమల తరహాలో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా, భారతీయ  శిల్పకళకు అద్దం పట్టేలా అత్యద్భుతంగా ఆలయాన్ని తీర్చిదిద్దనున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిర్మాణ ఆకృతులను అందజేసింది. వాటిని పరిశీలించిన ముఖ్యమంత్రి ఆలయ నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. రూ.140 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఆలయానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. నిర్మాణంలో చోళ, పల్లవ, చాళుక్య నిర్మాణ రీతులను మేళవించనున్నారు.<iframe src="https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fap7am%2Fvideos%2F295292641066200%2F&show_text=0&width=560" width="560" height="315" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allowFullScreen="true"></iframe>
Tirumala
Tirupati
Amaravathi
Andhra Pradesh
Chandrababu
TTD

More Telugu News