Chandrababu: ఈ నెల 27న ముంబయికి వెళ్లనున్న సీఎం చంద్రబాబునాయడు

  • అమరావతి బాండ్లు లిస్టింగ్ కార్యక్రమం
  • 27వ తేదీ ఉదయం 9.05 గంటలకు బీఎస్ఈ లో లిస్టింగ్
  • చంద్రబాబుతో సమావేశం కానున్న పారిశ్రామికవేత్తలు 
ఈ నెల 27న ఏపీ సీఎం చంద్రబాబునాయడు ముంబయికి వెళ్లనున్నారు. అమరావతి బాండ్లు బీఎస్ఈ లో లిస్టింగ్ నిమిత్తం ఆయన ముంబయికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. 27వ తేదీ ఉదయం 9.05 గంటలకు బీఎస్ఈ ప్రారంభం కాగానే అమరావతి బాండ్లు లిస్టింగ్ అవుతుంది. ముంబయి పర్యటనలో చంద్రబాబుతో పలువురు పారిశ్రామికవేత్తలు సమావేశం కానున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంచితే, విశాఖపట్టణంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన ‘జ్ఞానభేరీ’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే. అనంతరం, స్థానిక మధురవాడలోని విశాఖ కన్వెన్షన్ హాల్ లో ఎంపీ రవీంద్రబాబు కుమారుడి వివాహానికి చంద్రబాబు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించిన చంద్రబాబు వారికి అభినందనలు తెలిపారు. అనంతరం, తిరిగి విజయవాడకు బయలుదేరారు.
Chandrababu
mumbai

More Telugu News