kcr: రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నఅంశాలపై చర్చించే నిమిత్తం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కేసీఆర్ రేపు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం నిమిత్తం అవసరమైతే రెండు మూడు రోజులు అక్కడే ఉండి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులను కేసీఆర్ కలవనున్నట్టు సమాచారం.

సచివాలయానికి రక్షణ శాఖ స్థలాల కేటాయింపు గురించి, కొత్త జోనల్ వ్యవస్థ తదితర అంశాలకు సంబంధించిన ఫైల్స్ కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, రేపు ఉదయం టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేడర్ కు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.
Go Back to Shorts
kcr
delhi

More Telugu News