vijay devarakonda: నా నిర్మాతలు నాకు బ్రెయిన్ వాష్ చేస్తుంటారు: విజయ్ దేవరకొండ

  • బాలీవుడ్ కు వెళ్లే ఆలోచన లేదు
  • ఒకవేళ వెళ్లాలన్నా గట్టి పాత్ర దొరకాలి
  • వేరే పరిశ్రమకు వెళ్లకుండా నా నిర్మాతలు బ్రెయిన్ వాష్ చేస్తుంటారు
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' బాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్ అవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సందీప్ వంగానే... బాలీవుడ్ లో కూడా దీన్ని రూపొందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, మీరు బాలీవుడ్ కు వెళ్లే ఆలోచనలు ఉన్నాయా? అనే ప్రశ్న విజయ్ దేవరకొండకు ఎదురైంది. దీనిపై విజయ్ స్పష్టతనిచ్చాడు. బాలీవుడ్ కు వెళ్లే ఆలోచనలు తనకు లేవని స్పష్టం చేశాడు. ఒకవేళ బాలీవుడ్ లో అడుగుపెట్టాలన్నా... దానికి తగ్గ గట్టి పాత్ర దొరకాలని చెప్పాడు.

దక్షిణాది నిర్మాతలు తనను వదులుకోవాలని అనుకోవడం లేదని విజయ్ తెలిపాడు. నా స్నేహితులు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే వారికి తాను బ్రెయిన్ వాష్ చేస్తానని... ఎందుకంటే పెళ్లైన తర్వాత ఎప్పుడూ ఇంటి బాధ్యతలే గుర్తుకు వస్తుంటాయని చెప్పాడు. ఇదే విధంగా తన నిర్మాతలు కూడా తనను వేరే సినీపరిశ్రమకు వెళ్లకుండా బ్రెయిన్ వాష్ చేస్తుంటారని చెప్పాడు. 
vijay devarakonda
bollywood
entry
tollywood

More Telugu News