sri reddy: హైదరాబాదుకు గుడ్ బై చెప్పనున్న శ్రీరెడ్డి?

  • చెన్నైలో స్థిరపడే యోచనలో శ్రీరెడ్డి
  • తన బయోగ్రఫీ 'రెడ్డి డైరీ'లో నటిస్తున్న శ్రీరెడ్డి
  • హైదరాబాదులో తనకు రక్షణ లేదన్న సంచలన నటి
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వివాదం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారిన సినీ నటి శ్రీరెడ్డి హైదరాబాదుకు గుడ్ బై చెప్పబోతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నగరాన్ని శాశ్వతంగా వీడి, చెన్నైలో స్థిరపడాలనే ఆలోచనలో శ్రీరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.

 ప్రస్తుతం ఆమె తమిళంలో తెరకెక్కుతున్న తన బయోగ్రఫీ 'రెడ్డి డైరీ'లో నటిస్తోంది. హైదరాబాదులో తనకు రక్షణ లేదని ఆమె తెలిపింది. తెలుగు పరిశ్రమను మూడు కుటుంబాలు శాసిస్తున్నాయని చెప్పింది. మరోవైపు, తమిళ సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులపై కూడా శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అక్కడ ఆమె ఎంత మేరకు సెటిల్ అవుతుందో వేచి చూడాలి.
sri reddy
reddy dairy
chennai
hyderabad
shift

More Telugu News