పోలవరం ప్రాజెక్టును చుట్టుముట్టిన నీరు.. మూడువేల మంది కార్మికులను ఖాళీ చేయించిన అధికారులు
- గోదావరికి వరద ఉద్ధృతి
- ప్రాజెక్టులోకి వచ్చి చేరిన నీళ్లు
- స్పిల్వే లోకి రాకుండా మట్టిదిబ్బ ఏర్పాటు
దీంతో స్పిల్ వేలోకి నీరు రాకుండా భారీ డంపర్లు, ఎక్స్కవేటర్లతో పది అడుగుల ఎత్తున పెద్ద మట్టి గుట్ట పేర్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కార్మికుల కోసం ఎగువ భాగంలో గతంలో వేసిన క్యాంపుల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో అందులో చిక్కుకున్న మూడు వేల మందిని ఖాళీ చేయించారు. ప్రాజెక్టులోకి వచ్చి చేరిన నీటిని తోడి బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.