Telangana: ‘ముందస్తు’కు వెళితే కేసీఆర్ పీడ విరగడైపోతుంది: జైపాల్ రెడ్డి

  • మేం కూడా ముందస్తుకే చూస్తున్నాం
  • అప్పుడు వాజ్‌పేయి ఇలా చేసే ఓటమి పాలయ్యారు
  • ముందస్తుకు వెళితే కేసీఆర్‌కూ అదే గతి
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ముందస్తు ఎన్నికలకు వెళితే రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైపోతుందని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఎస్.జైపాల్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన తాము కూడా ముందస్తు ఎన్నికల కోసమే ఎదురుచూస్తున్నామన్నారు. అవి ఎంత తొందరగా వస్తే అంత తొందరగా కేసీఆర్ పీడ విరగడై పోతుందన్నారు. కేసీఆర్ ముందస్తుకు వెళితే ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు. 2004లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి కూడా ‘ఇండియా షైనింగ్’ నినాదంతో ముందస్తుకు వెళ్లి ఓటమి పాలయ్యారని ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి గుర్తు చేశారు.
Telangana
TRS
KCR
Jaipal Reddy
Mahabubabad District
AICC

More Telugu News