mumbai: ముంబయిలోని క్రిస్టల్ టవర్ లో అగ్నిప్రమాదం.. నలుగురి మృతి!

  • పరేల్ లోని 16 అంతస్తుల అపార్టుమెంట్ లో ఘటన
  • పన్నెండో అంతస్తులో మంటలు
  • పదహారు మందికి గాయాలు
ముంబయిలోని 16 అంతస్తుల అపార్ట్ మెంట్ లో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పదహారు మంది గాయపడ్డారు. స్థానిక పరేల్ ప్రాంతంలోని క్రిస్టల్ టవర్లో ఉన్న ఈ అపార్టుమెంట్ లోని 12వ అంతస్తులో ఈరోజు ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు.  

అపార్టుమెంట్ లో చిక్కుకుపోయిన వారిని క్రేన్ల సాయంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. పైఅంతస్తులలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో అనే అనుమానంతో అగ్నిమాపక సిబ్బంది గదుల తలుపులు పగలగొట్టి ఫ్లాట్స్ లోకి వెళ్లి పరిశీలించారు. ఈ ప్రమాద సంఘటనను బృహన్ ముంబయి కార్పొరేషన్, అగ్నిమాపక శాఖాధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
mumbai
cristal tower

More Telugu News