Telugudesam: ప్రొటోకాల్ రగడ.. ఎంపీ కేశినేని నాని పేరు లేకపోవడంపై టీడీపీ నేతల ఆగ్రహం!

  • రేపు ‘స్కూల్ ఆఫ్ ప్లానింగ్..’ భవనం ప్రారంభోత్సవం
  • విచ్చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • ఆహ్వానపత్రికలో నాని పేరు లేకపోవడంతో వివాదం 
విజయవాడలో నిర్మించిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ పరిపాలనా భవనాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రేపు ప్రారంభించనున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన ఆహ్వానపత్రికలో స్థానిక ఎంపీ కేశినేని నానితో పాటు ప్రజాప్రతినిధుల పేర్లను ప్రచురించలేదు. దీంతో, టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. స్థానిక ఎంపీ పేరును ఆహ్వానపత్రికలో ఎందుకు చేర్చలేదని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించకపోవడం మంచి పద్ధతి కాదని మండిపడుతున్నారు. కాగా, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ప్రారంభోత్సవ సమయంలో నిరసన చేపట్టాలని టీడీపీ నాయకులు నిర్ణయించినట్టు సమాచారం.
Telugudesam
Kesineni Nani
Vijayawada

More Telugu News