Allu Arjun: పునర్జన్మల నేపథ్యంలో బన్నీ నెక్స్ట్ మూవీ?

  • బన్నీ కోసం కథ రెడీ 
  • దర్శకుడిగా విక్రమ్ కుమార్ 
  • వచ్చేనెలలో సెట్స్ పైకి
బన్నీ తన సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు .. ఎన్నో కసరత్తులు చేస్తాడు. అంతగా కష్టపడి చేసిన సినిమాలు పరాజయం పాలైతే ఆయన ఆలోచనలో పడటం సహజమే. అలా 'నా పేరు సూర్య' సినిమా విషయంలో డీలాపడిన బన్నీ .. తదుపరి సినిమా విషయంలో అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఆ కథలో ఉండేలా చూసుకుంటున్నాడు.

బన్నీ నెక్స్ట్ మూవీ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వుండనుందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కథ ఏమై వుంటుందనే ఆసక్తి అభిమానుల్లో తలెత్తుతోంది. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో రూపొందనుందనేది తాజా సమాచారం. కీలకమైన పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది కనుక, బన్నీ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడట. వచ్చేనెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది .. ఈ లోగా పూర్తి వివరాలు తెలిసే అవకాశం వుంది.     
Allu Arjun
vikram kumar

More Telugu News