సైన్యంతో పరాచికాలు... సాయం చేసేందుకు వస్తే... హెలికాప్టర్ ముందు సెల్ఫీ దిగి.. బై చెప్పాడు!
- వరదలు ముంచెత్తి సాయం కోసం చూస్తున్న కేరళ వాసులు
- ఎరుపు చొక్కాను చూపించి హెలికాప్టర్ ను దించిన యువకుడు
- ఆపై సెల్ఫీ దిగడంతో విస్తుపోయిన రెస్క్యూ సిబ్బంది
వర్షం తగ్గి, వరద నెమ్మదించిన వేళ, ఇప్పటికీ చిక్కుకునే ఉన్న బాధితుల కోసం కొంతమంది రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ లో గాలిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. కింద ఉన్న ఓ యువకుడు, తాను ధరించిన ఎరుపు రంగు చొక్కాను విప్పి గాల్లోకి ఊపుతూ హెలికాప్టర్ కు చూపించాడు. అతను ఆపదలో ఉన్నాడని భావించి, చాపర్ ను కిందకు దించగా, చక్కగా దాని ముందుకు వచ్చి, ఓ సెల్ఫీ దిగి, ఆపై వారిని వెళ్లిపోవాలని చెప్పడంతో హెలికాప్టర్ లోని సిబ్బంది విస్తుపోయారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో వెల్లడించడంతో సదరు యువకుడి వైఖరి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ కామెంట్లు వస్తున్నాయి.