Chiranjeevi: చిరంజీవి మా అందరివాడు: రోజా విషెస్

  • మెగాస్టార్ 63వ పుట్టినరోజు నేడు
  • చిరును కలసి శుభాకాంక్షలు తెలిపిన రోజా
  • సోషల్ మీడియాలో ఫొటోలు షేర్
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. 1955 ఆగస్ట్ 22న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన జన్మించారు. 63వ పుట్టినరోజును జరుపుకుంటున్న చిరుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే రోజా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. 'మా అందరివాడు మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఫొటోలను షేర్ చేశారు.
మరోవైపు నిన్న హైదరాబాద్ శిల్పకళావేదికలో మెగాహీరోలంతా అభిమానులతో కలసి మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అల్లు అరవింద్, నాగబాబు, సునీల్, పరుచూరి బ్రదర్స్, ఉత్తేజ్ తదితరులు కూడా తరలివచ్చారు. చిరు పుట్టినరోజు సందర్భంగా 'సైరా' టీజర్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
Chiranjeevi
roja
birthday
tollywood
YSRCP

More Telugu News