Hyderabad: నేడు హైదరాబాద్‌కు వాజ్‌పేయి చితాభస్మం.. గోదావరి, మూసీ నదిలో కలపనున్న నేతలు

  • నేటి సాయంత్రం శంషాబాద్‌కు వాజ్‌పేయి చితాభస్మం
  • సందర్శకుల కోసం అక్కడే కాసేపు
  • అనంతరం పార్టీ కార్యాలయానికి తరలింపు
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చితాభస్మం నేడు హైదరాబాద్‌కు రానుంది. రెండు కలశాల్లో నేటి సాయంత్రం నాలుగు గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనుంది. ప్రజల సందర్శనార్థం అక్కడే కొంతసేపు ఉంచుతారు. అనంతరం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి తరలిస్తారు.

గురువారం చితాభస్మాన్ని తెలంగాణలోని రెండు నదుల్లో కలుపుతారు. అయితే, ఎక్కడ కలపాలన్న విషయంపై చర్చించిన నేతలు బాసర వద్ద గోదావరిలో, వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలోని మూసీ నదిలో కలపాలని నిర్ణయించారు. బాసరలో కలిపేందుకు బీజేపీ నేతలు మురళీధర్‌రావు, లక్ష్మణ్, ప్రేమేందర్ రెడ్డి వెళ్లనుండగా, అనంతగిరికి దత్తాత్రేయ, కిషన‌రెడ్డి, ఆచారి వెళ్లనున్నారు.
Hyderabad
vajpayee
godavari river
Moosi River
BJP
Telangana

More Telugu News