కేరళకు కోహ్లీ 84 కోట్లు, రొనాల్డో 77 కోట్ల సాయం.. సోషల్ మీడియాలో వార్తలు.. అసలు నిజం ఇదీ!
- కేరళ వరద సాయంపై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్
- ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేస్తూ వైరల్ చేస్తున్న వైనం
- విషాదంలో పరాచికాలు తగవంటూ హితవు పలుకుతున్న నెటిజన్లు
ఒక్క రొనాల్డోనే రూ.77 కోట్లు ఇస్తే భారత ప్రభుత్వం ఎంతివ్వాలని, ఏదో మొక్కుబడిగా సాయం చేసి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టీమిండియా సారథి కోహ్లీ కూడా రూ.84 కోట్లను విరాళంగా ప్రకటించాడంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇవన్నీ తప్పుడు వార్తలని, ఎవరో పనిలేని వ్యక్తులు చేసిన పని ఇదని తేలింది.
ఎవరో పెట్టిన పోస్టులో నిజానిజాలు తెలుసుకోకుండా, లైకులు, షేర్లు, కామెంట్లతో ఇలా వైరల్ చేయడం తగదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విషాదంలో ఇలాంటి పరాచికాలు తగదని హితవు పలుకుతున్నారు. కాగా, తమిళ హీరో విజయ్ రూ.14 కోట్లు ఇచ్చినట్టు కూడా ఓ న్యూస్ హల్చల్ చేసింది. అయితే, తాజాగా విజయ్ రూ.70 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడంతో ఫేక్‌న్యూస్‌కు అడ్డుకట్ట పడింది.