Andhra Pradesh: చిన్న బడ్జెట్ సినిమాలకు ప్రోత్సాహకాలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- చిన్న బడ్జెట్ సినిమాలను స్టేట్ జీఎస్టీ తొలగింపు
- ఏపీలోనే పోస్ట్ ప్రొడక్షన్ చేయాలనే నిబంధన
- పది చిన్న సినిమాలకు ప్రతీ ఏడాది ప్రోత్సాహకాలు
చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.4 కోట్ల లోపు బడ్జెట్ తో తీసే సినిమాలను చిన్న బడ్జెట్ చిత్రాలుగా పరిగణిస్తామని, ఆ చిత్రాలను స్టేట్ జీఎస్టీ నుంచి తొలగిస్తున్నట్టు ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది.
చిన్న సినిమాలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తామని, ఏపీలోనే పోస్ట్ ప్రొడక్షన్ చేయాలనే నిబంధనను విధిస్తున్నట్టు ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికాకృష్ణ తెలిపారు. సినిమాపై విధించే వినోదపు పన్ను మొత్తం వెనక్కి ఇస్తామని, పన్ను రాయితీలతో పాటు, లొకేషన్లు ఉచితంగా ఇస్తామని, సంస్కృతీసంప్రదాయలను ప్రతిబింబిస్తూ తీసే, పది చిన్న సినిమాలకు ప్రతీ ఏడాది ప్రోత్సాహకాలు అందజేస్తామని పేర్కొన్నారు.