jagan: జగన్ కు ఫ్లెక్సీలు కట్టిన వారే ఇసుక మాఫియాలో పెద్ద దొంగలు: టీడీపీ ఎమ్మెల్యే అనిత
- పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది
- అవినీతిపరులకు రాష్ట్రంలో అభివృద్ధి కనపడదు
- జగన్ లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకోం
పాయకరావుపేట నియోజకవర్గ కోటవురట్లలో వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డారు. ఈ ఆరోపణలపై జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టు.. అవినీతిపరులకు అనినీతి తప్ప రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి వారికి కనపడదని విమర్శించారు.
లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, జగన్ కు ఫ్లెక్సీలు కట్టిన వారే ఇసుక మాఫియాలో పెద్ద దొంగలని ఆరోపించారు. ఈ విషయం తాము చెప్పడం లేదని, వారిపై ఇప్పటికే నమోదైన కేసులే ఇందుకు నిదర్శనమని అన్నారు. జగన్ కు సీఎం కుర్చీ తప్ప ఇంకేమీ అవసరం లేదని విమర్శించారు.