banglore: అసహజ శృంగారానికి భర్త బలవంతం.. తట్టుకోలేక భార్య ఆత్మహత్యాయత్నం!

  • కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘటన
  • భార్యను పైశాచికత్వంతో వేధించిన భర్త
  • మనస్తాపంతో యువతి ఆత్మహత్య
అసహజ రీతిలో శృంగారం కోసం భర్త ఒత్తిడి చేయడంతో ఓ మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. నగరంలోని ఓ మహిళ(25) స్థానికంగా ఓ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. ఆమెకు భర్త, ఓ కుమార్తె(6) ఉన్నారు. అయితే పెళ్లయిన కొత్తలో బాగానే ఉన్న సదరు వ్యక్తి..  కొన్నేళ్ల నుంచి అసహజ రీతిలో శృంగారం కోసం బలవంతం చేయడం మొదలుపెట్టాడు. దీంతో సదరు మహిళ కుమార్తెతో కలసి ఏడాది క్రితం పుట్టింటికి వచ్చేసింది.

అయితే కుమార్తెను చూసేందుకు అత్త వారింటికి వచ్చిన భర్త మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టుకున్నాడు. గతంలో వేధించినట్లే అక్కడ కూడా ఆమెను అసహజ శృంగారం కోసం ఇబ్బంది పెట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన భార్య.. నిద్ర మాత్రలు మింగి, చేతి నరాలు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. రక్తపు మడుగులో పడిఉన్న బాధితురాలని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం బాధితురాలి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆసుపత్రి వర్గాల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆమె వాంగ్మూలం సేకరించారు. అనంతరం ఐపీసీ 376బీ, 498ఏ సెక్షన్ల కింద భర్తపై కేసు నమోదు చేశారు.
banglore
Karnataka
domestic violance
suicide

More Telugu News