టైటిల్ కి తగినట్టుగానే 'సైరా' అనిపించిన టీజర్ .. యువ హీరోల స్పందన
- షూటింగు దశలో 'సైరా'
- చిరూ బర్త్ డే కానుకగా వచ్చిన టీజర్
- పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టిన చిరూ
'ఈ యుద్ధం ఎవరిది .. మనది' అంటూ చిరూ చెప్పిన డైలాగ్ .. ఈ సినిమా రిలీజ్ వరకూ అభిమానులు సరిపెట్టుకునేంత పవర్ఫుల్ గా వుంది. ఇక ఈ టీజర్ చూసిన నాని .. "ఈ సినిమా ఎవరిది .. ? మనది" అంటూ తన హర్షాన్ని వ్యక్తం చేశాడు. 'టీజర్ కిర్రాక్ వుంది లే' అంటూ విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో స్పందించాడు. ఈ సినిమా చరిత్ర సృష్టించడం ఖాయమనే అభిప్రాయాన్ని అనసూయ వ్యక్తం చేసింది. సాయిధరమ్ తేజ్ .. వరుణ్ తేజ్ .. ఇద్దరూ కూడా టీజర్ అద్భుతంగా ఉందనీ .. సినిమా విడుదల వరకూ వెయిట్ చేయడం కష్టమేనంటూ ఉత్సాహాన్ని ప్రదర్శించారు.