chiranjeevi: టైటిల్ కి తగినట్టుగానే 'సైరా' అనిపించిన టీజర్ .. యువ హీరోల స్పందన

  • షూటింగు దశలో 'సైరా'
  • చిరూ బర్త్ డే కానుకగా వచ్చిన టీజర్
  • పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టిన చిరూ 
తెలుగు సినిమాను కొత్తపుంతలు తొక్కించిన కథానాయకుడు చిరంజీవి. అప్పటివరకూ నడుస్తోన్న ట్రెండును పూర్తిగా మార్చేసిన ఘనత ఆయన సొంతం. అలాంటి చిరంజీవి పుట్టినరోజు రేపు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తాజా చిత్రమైన 'సైరా' నుంచి ఫస్టు టీజర్ ను వదిలారు. తెల్లదొరలపై నరసింహా రెడ్డి తిరుగుబాటు బావుటాను ఎగరేస్తూ గుర్రంపై వాళ్లపైకి దూసుకురావడం ఈ టీజర్ కి హైలైట్ గా నిలిచింది.

'ఈ యుద్ధం ఎవరిది .. మనది' అంటూ చిరూ చెప్పిన డైలాగ్ .. ఈ సినిమా రిలీజ్ వరకూ అభిమానులు సరిపెట్టుకునేంత పవర్ఫుల్ గా వుంది. ఇక ఈ టీజర్ చూసిన నాని .. "ఈ సినిమా ఎవరిది .. ? మనది" అంటూ తన హర్షాన్ని వ్యక్తం చేశాడు. 'టీజర్ కిర్రాక్ వుంది లే' అంటూ విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో స్పందించాడు. ఈ సినిమా చరిత్ర సృష్టించడం ఖాయమనే అభిప్రాయాన్ని అనసూయ వ్యక్తం చేసింది. సాయిధరమ్ తేజ్ .. వరుణ్ తేజ్ .. ఇద్దరూ కూడా టీజర్ అద్భుతంగా ఉందనీ .. సినిమా విడుదల వరకూ వెయిట్ చేయడం కష్టమేనంటూ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. 
chiranjeevi
nayanatara

More Telugu News