YV Subba Reddy: వైవీ సుబ్బారెడ్డి ఓ పందికొక్కు.. మొత్తం బయటపెడతా: దేవినేని ఉమ

  • గుండ్లకమ్మ ప్రాజెక్టులో డబ్బులు తిన్న పందికొక్కు
  • ఆయన అవినీతినంతా బయటపెడతా
  • డబ్బు మదంతో, కండకావరంతో జగన్ మాట్లాడుతున్నారు
వైసీీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జాతీయ జల అభివృద్ధి సంస్థ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వెలిగొండ టన్నెల్ నిర్మాణంపై వైవీ సుబ్బారెడ్డి పాదయాత్ర చేస్తున్నారని... ఆయన చేయాల్సింది పాదయాత్ర కాదని, కాశీ యాత్ర అని తాను అన్నానని... దానికి సమాధానంగా వైసీపీ అధికారంలోకి వస్తే, తనను జైల్లో పెడతామని హెచ్చరించారని చెప్పారు. దొంగలు, సన్నాసులు, 420 కేసుల్లో ముద్దాయిలు మమ్మల్ని జైల్లో పెడతారా? అని ప్రశ్నించారు. బుద్ధి, జ్ఞానం ఉండే ఆయన మాట్లాడుతున్నారా? అని అన్నారు.

గుండ్లకమ్మ ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ నిర్మించకుండా... డబ్బులు తిన్న పందికొక్కు వైవీ సుబ్బారెడ్డి అంటూ దేవినేని ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాజెక్టులో వైవీ చేసిన అవినీతినంతా బయటపెడతానని చెప్పారు. డబ్బు మదంతో, కండకావరంతో జగన్ మాట్లాడుతున్నారని... ఆయన సొంతూరు పులివెందులకు నీళ్లిచ్చినా భరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. 
YV Subba Reddy
devineni uma
jagan

More Telugu News