hayat nagar: మా రోడ్లను కాపాడండి సార్.. పోలీస్ అధికారి కాళ్లు పట్టుకున్న టీఆర్ఎస్ నేత!

  • టీఆర్ఎస్ నేత తిరుపాల్ రెడ్డి వినూత్న నిరసన
  • ఓవర్ లోడ్ లారీలపై ఆగ్రహం
  • రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆవేదన
కంకర, ఇసుకను అక్రమంగా ఓవర్ లోడ్ తో లారీల్లో తమ ప్రాంతం మీదుగా రవాణా చేయడంపై హయత్ నగర్ కార్పొరేటర్, టీఆర్ఎస్ నేత సామ తిరుపాల్ రెడ్డి వినూత్న నిరసన తెలిపారు. ఈ లారీలు హయత్ నగర్ పై నుంచి రాకపోకలు సాగిస్తూ ఉండటంపై ఆయన పోలీస్ అధికారుల్ని నిలదీశారు. తమ ప్రాంతంలో రోడ్లు ధ్వంసం కాకుండా కాపాడాలని కోరుతూ పోలీస్ అధికారి కాళ్లు పట్టుకున్నారు.

హయత్ నగర్ వద్దకు ఓవర్ లోడ్ తో 50 లారీలు రావడంపై తిరుపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను పట్టుకోమంటే పోలీసులు ఘటనాస్థలం నుంచి పారిపోతున్నారని విమర్శించారు. ఈ ఘటనలో చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని తిరుపాల్ హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

hayat nagar
Police
Hyderabad
oficers

More Telugu News