nani: గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాని

షార్ట్స్‌లో చూడండి
తెలుగు .. తమిళ భాషల్లో దర్శకుడిగా గౌతమ్ మీనన్ కి మంచి క్రేజ్ వుంది. హీరో విక్రమ్ తో సినిమాను పూర్తిచేసిన ఆయన, తన తదుపరి సినిమాను ధనుష్ .. మేఘా ఆకాశ్ కాంబినేషన్లో చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తరువాత నాని హీరోగా ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో గౌతమ్ మీనన్ వున్నాడట.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'ఎటో వెళ్లిపోయింది మనసు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాకపోతే ఈ సినిమా అంతగా ఆడలేదు. అయినా గౌతమ్ మీనన్ పై గల నమ్మకంతో నాని ఈ సినిమా చేయడానికి అంగీకరించాడని అంటున్నారు. గౌతమ్ మీనన్ సినిమా తరువాతనే అవసరాల శ్రీనివాస్ .. హను రాఘవపూడితో నాని సినిమాలు చేయనున్నట్టు తెలుస్తోంది. గౌతమ్ మీనన్ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 
Go Back to Shorts
nani
gauthammenon

More Telugu News