sudheer babu: 'నన్నుదోచుకుందువటే' నుంచి 'బిగ్ బాస్' సాంగ్ రిలీజ్

  • సుధీర్ బాబు హీరోగా 'నన్ను దోచుకుందువటే'
  • శాడిస్టు బాస్ పాత్రలో సుధీర్ బాబు 
  • వచ్చేనెల 13వ తేదీన సినిమా విడుదల  
వైవిధ్యభరితమైన కథాచిత్రాలను చేస్తూ సుధీర్ బాబు తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'నన్ను దోచుకుందువటే' రూపొందింది. వచ్చేనెల 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'బిగ్ బాస్' అనే సాంగ్ ను వదిలారు. అజనీష్ లోకనాథ్ స్వరపరిచిన ఈ పాటను టిపూ .. హర్షిక దేవనాథన్ ఆలపించారు.

'బిగ్ బాస్' గా ఆఫీసులోని ఉద్యోగులను టార్చర్ పెట్టే పాత్రలో సుధీర్ బాబు కనిపిస్తున్నాడు. ఉద్యోగులను ఒక్కొక్కరినీ శ్మశానానికి చేరుస్తూ ఉంటాడు. ఆఫీస్ లోని ఉద్యోగులు ఆయన పెట్టే టెన్షన్ తట్టుకోలేక, తలపట్టుకుంటూ వుంటారు. ఆయనకి నవ్వనేది తెలియదనీ .. మనుషులు .. మాటలు అవసరం లేదనీ .. కలియుగంలో పనిరాక్షసుడనీ .. తమ పాలిట యమధర్మరాజు అని ఈ పాటలో వాపోతున్నారు. సుధీర్ బాబు స్వరూప స్వభావాలను ఈ పాటలో చెప్పిన తీరు బాగుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన కథానాయికగా నాభా నటేష్ నటించిన సంగతి తెలిసిందే.
sudheer babu
nabaha natesh

More Telugu News